- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య-46 థియేటర్లలో వచ్చేది ఎప్పుడంటే..?
కోలీవుడ్ యాక్టర్ సూర్య(Surya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యాక్టర్ సూర్య(Surya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి వెంకీ అట్లూరి(Venkey Atluri) డైరెక్షన్‌లో చేస్తున్న సూర్య 46 (Suriya 46) ఒకటి. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేం మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటి రవీనా టాండన్(Raveena Thandan) కీలక పాత్ర పోషిస్తోంది.
జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈక్రమంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇందులో భాగంగా ఈ సినిమాను జూలై 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారంటూ తాజాగా మరో అప్‌డేట్ తెరపైకి వచ్చింది. దీనిపై సూర్య టీం నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఇన్‌సైడ్ వర్గాల టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Read More..






