కమల్ హాసన్ ‘లీడ్ ఆన్ గాంధీ’.. గాంధీని హతమార్చిన బుల్లెట్ ప్రయాణం

by Sujitha Rachapalli |

కమల్ హాసన్, గోపాల కృష్ణ గాంధీ సందేశాలతో రూపొందిన “లీడ్ ఆన్ గాంధీ” అనే పవర్ ఫుల్ డాక్యుమెంటరీ విడుదలైంది. భారతదేశ నైతికత, ప్రజాస్వామ్య విలువల నుంచి పుట్టిన గొంతులు ఇందులో ఇంటెన్స్‌గా వినిపిస్తాయి.

కమల్ హాసన్ ‘లీడ్ ఆన్ గాంధీ’.. గాంధీని హతమార్చిన బుల్లెట్ ప్రయాణం
X

దిశ, సినిమా : కమల్ హాసన్, గోపాల కృష్ణ గాంధీ సందేశాలతో రూపొందిన “లీడ్ ఆన్ గాంధీ” అనే పవర్ ఫుల్ డాక్యుమెంటరీ విడుదలైంది. భారతదేశ నైతికత, ప్రజాస్వామ్య విలువల నుంచి పుట్టిన గొంతులు ఇందులో ఇంటెన్స్‌గా వినిపిస్తాయి. ఈ డాక్యుమెంటరీ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని హతమార్చిన బుల్లెట్ ప్రయాణాన్ని.. ఇటలీ గనుల నుంచి, న్యూఢిల్లీ బిర్లా హౌస్ వరకు చూపించిన తీరు ఆలోచన రేకెత్తించేలా వుంది. ఒకే ఒక బుల్లెట్ కథ ద్వారా.. హింస ఎలా దేశాలు, సరిహద్దులు దాటుతుందో.. శాంతి ఆలోచనలు మాత్రం ఎంత కష్టంగా ప్రయాణిస్తాయో ఈ ఫిల్మ్ స్పష్టంగా చూపిస్తుంది. ఇది కేవలం చరిత్రాత్మక డాక్యుమెంటరీ కాదు.. 1948 జనవరి 30న మనం ఏమి కోల్పోయామో ఆలోచింపజేసే ఫిల్మ్. నేటి ప్రపంచంలో విభజన, అసహనం సాధారణమవుతున్న సమయంలో అహింసను బలహీనతగా చూసినప్పుడు ఏమవుతుంది? గాంధీ చూపిన నైతిక ధైర్యాన్ని సమాజం మరిచితే పరిణామాలు ఏంటి? అనే అవసరమైన ప్రశ్నలని ఈ ఫిల్మ్ సంధిస్తోంది. గాంధీజీ అనే మనిషిని బుల్లెట్ చంపింది, కానీ ఆయన ఆలోచనలు ఎప్పటికీ నిలిచిపోతాయని ఈ డాక్యుమెంటరీ గుర్తు చేస్తుంది.

Next Story