స్త్రీ తలుచుకుంటే ఆ హింస భయంకరంగా ఉంటుంది.. నిర్మాతలకు సవాలు విసిరిన చిత్రాంగద సింగ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-04 06:38:57  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh)నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది.

స్త్రీ తలుచుకుంటే ఆ హింస భయంకరంగా ఉంటుంది.. నిర్మాతలకు సవాలు విసిరిన చిత్రాంగద సింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh)నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది. 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఆధిత్య ధర్ ‘ధురంధర్ రివెంజ్’(Dhurandhar Revenge)పేరుతో సీక్వెల్ తీసుకురాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 19న ఉగాది కానుకగా.. థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచడంతో పాటు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ 'హంజా' అనే పవర్‌ఫుల్ పాత్రలో పాకిస్థాన్ గడ్డపై శత్రువుల పని పడుతూ కనిపించారు. ‘‘ఇది కొత్త హిందుస్థాన్.. ఇంట్లోకి చొరబడి మరీ కొడుతుంది’’ అనే డైలాగ్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి దిగ్గజ నటులు నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ వార్ డ్రామాలు, యాక్షన్ సినిమాల్లో మహిళల పాత్రలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

యాక్షన్ థ్రిల్లర్లలో ఎప్పుడూ పురుషులే ఎందుకు ప్రధాన పాత్రలు పోషిస్తారనే ప్రశ్నకు.. చిత్రాంగద సింగ్ స్పందిస్తూ.. ‘‘శారీరకంగా, జీవశాస్త్రపరంగా మహిళలు ఆ తరహా కఠినమైన యాక్షన్ పాత్రలకు సరిపోరని చాలామంది భావిస్తారు. ఇది వినడానికి కొంతమందికి చేదుగా ఉండవచ్చు, కానీ అది వాస్తవం’’ అని ఆమె పేర్కొన్నారు. యుద్ధ రంగంలో లేదా ప్రమాదకరమైన మిషన్లలో రణవీర్ సింగ్ వంటి పాత్రలు చేసే విన్యాసాలు మహిళలకు శారీరక పరిమితుల వల్ల కష్టతరమవుతాయని చెప్పింది. కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా, సామాజిక కారణాలు కూడా మహిళలను ఇలాంటి సినిమాల్లో లీడ్ రోల్స్ చేయకుండా అడ్డుకుంటున్నాయని ఆమె అభిప్రాయపడింది. సమాజంలో మహిళల పట్ల ఉండే దృక్పథం, వారిని ప్రమాదకర ప్రాంతాలకు పంపే విషయంలో ఉండే ఆంక్షలు సినిమాల్లో కూడా చూపిస్తారని తెలిపింది. ఒక కథలో వాస్తవికత ఉండాలంటే, కొన్నిసార్లు పురుషులకే ఆ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని ఆమె సమర్థించింది.

అయితే, మహిళా ప్రధాన యాక్షన్ సినిమాలు రాకూడదని తన ఉద్దేశ్యం కాదని ఆమె స్పష్టం చేసింది. ‘‘ఒకవేళ ఒక మహిళను ఆ స్థాయికి తీసుకువెళితే, ఆమె చూపించే హింస.. యాక్షన్ చాలా అనూహ్యంగా ఉంటుంది. ఒక మహిళ తన పరిమితులను దాటి పోరాడితే, ఆ సినిమా చూసే ప్రేక్షకులకు అది ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అద్భుతమైన స్క్రిప్ట్ ఉంటే మహిళలతో చేయండి.. ఇలాంటి ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి’’ అని చిత్రాంగద నిర్మాతలకు సవాలు విసిరింది. కాగా.. చిత్రాంగద సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు త్వరలో ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించబోతోంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 2020లో తూర్పు లడఖ్ గల్వాన్ లోయలో భారతదేశం, చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా రూపొందించారు. ఇందులో జైన్ షా, అంకుర్ భాటియా, విపిన్ భరద్వాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలతో పోరాడుతూ మరణించిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాను ఏప్రిల్ 17న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు.

ట్రోలింగ్‌కి భయపడే టైపు కాదు.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ‘బోర్డర్-2’ భామ

Next Story