- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రోలింగ్‌కి భయపడే టైపు కాదు.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ‘బోర్డర్-2’ భామ
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే విమర్శలు ‘బోర్డర్ 2’ నటి మేధా రాణా (Medha Rana)ఘాటుగా స్పందించింది.

దిశ, సినిమా: సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై వచ్చే విమర్శలు ‘బోర్డర్ 2’ నటి మేధా రాణా (Medha Rana)ఘాటుగా స్పందించింది. తన పనితోనే విమర్శకుల నోళ్లు మూయించాలనే వరుణ్ ధావన్ (Varun Dhawan)సిద్ధాంతం తనకు ఎంతో నచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఏదో ఒక మూల విమర్శలు వినిపిస్తూనే ఉంటాయని, అందరినీ మెప్పించడం ఎవరికీ సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. వరుణ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న విమర్శలను ఎలా ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నారో చూసి తాను కూడా అవే పాఠాలు నేర్చుకుంటున్నానని మేధా చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియా నెగిటివిటీ తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై మేధా రాణా స్పందిస్తూ.. ‘‘సోషల్ మీడియా వ్యాఖ్యలు నన్ను బాధించవు అని చెబితే అది అబద్ధం అవుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారిపై ఇలాంటి కామెంట్స్ బాగా ప్రభావితం చూపుతాయి’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కొంతకాలం తర్వాత నుండి ఆ నెగిటివిటీని పట్టించుకోకుండా ఉండటం నేర్చుకున్నానని, విమర్శించే వారు.. వారిలోని అభద్రతా భావం లేదా అసహనం వల్ల అలా రాస్తుంటారని ఆమె చెప్పింది. ట్రోలింగ్‌కి భయపడే టైపు కాదని.. అలాంటి వాటి నుండి దూరంగా ఉండి, కేవలం తన నటనపై దృష్టి పెట్టడం నేర్చుకుంటున్నట్లు తెలిపింది. ‘బోర్డర్ 2’ షూటింగ్ సమయంలో వరుణ్ ధావన్ తనకు ఇచ్చిన మద్దతును మేధా గుర్తు చేసుకున్నారు.
మొదట్లో వరుణ్ వంటి స్టార్ హీరోతో నటించడానికి తాను చాలా భయపడ్డానని, కానీ ఆయన తనను వెంటనే సౌకర్యవంతంగా ఉండేలా చేశారని పేర్కొంది. వరుణ్ సహాయం వల్లే తాను తన పాత్రలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగానని ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మేధా, త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్‌పై సంతకం చేయబోతున్నట్లు వెల్లడించారు. కాగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్-2’ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. 1971 భారత-పాక్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తోంది.






