- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అవుతారు. ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించనున్నారు. పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను సైతం చంద్రబాబు కలవనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై విభజన హామీల అమలు, నిధుల విడుదలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా పీయూష్ గోయల్ తో సమావేశమై రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణపై విజ్ఞప్తులు ఇవ్వనున్నారు.
మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయి రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు, కేంద్రం అందించే సాయం గురించి చర్చించనున్నారు. అదేవిధంగా సీఆర్ పాటిల్ తో సమావేశమై జీవనాడి పోలీవరం ప్రాజెక్టు నిధులు, పనుల పురోగతి, రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఈ ఎయిర్ పోర్ట్ను నిర్మించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అభివృద్ధిలో ఇది మైలురాయిగా నిలవనుంది.






