తెలంగాణకు ద్రోహం చేసిన జాతి ఎవరిదో ప్రజలకు తెలుసు.. కేటీఆర్‌పై బల్మూర్ వెంకట్ ఫైర్

by Ramesh Naini |

అధికారం లేక, అసహనంతో, అహంకారంతో, కేటీఆర్ పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడని, తెలంగాణకు ద్రోహం చేసిన జాతి ఎవరిదో? తెలంగాణకు మేలు చేసిన జాతి ఎవరిదో? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ అన్నారు.

తెలంగాణకు ద్రోహం చేసిన జాతి ఎవరిదో ప్రజలకు తెలుసు.. కేటీఆర్‌పై బల్మూర్ వెంకట్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికారం లేక, అసహనంతో, అహంకారంతో, కేటీఆర్ పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడని, తెలంగాణకు ద్రోహం చేసిన జాతి ఎవరిదో? తెలంగాణకు మేలు చేసిన జాతి ఎవరిదో? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ అన్నారు. మంగళవారం సీఎల్పీలోని మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాటాన్ని గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన జాతి కాంగ్రెస్ పార్టీదని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారం ప్రదర్శించిన జాతి మీదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల చైతన్యం ముందు చెత్తకుప్పలో పడిన జాతి మీదని, అందుకే 2023 ఎన్నికల్లో తెలంగాణనికి ద్రోహం చేసిన జాతిని ప్రజలు ఓడించారని బల్మూర్ వెంకట్ తెలిపారు.

రాష్ట్రంలో అన్నదాతలకు అండగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని, ఇవేవీ తెలుసుకోకుండా కేటీఆర్ బయట మచ్చర్ పహిల్వాన్ మాటలు మాట్లాడుతున్నాడని వెంకట్ విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉందని, అనుకున్న స్థాయిలో ఇప్పటి వరకు వర్షాలు పడలేదు, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ఈ కరువు పరిస్థితులను కూడా రాజకీయాలకు వాడుకునే నీచమైన జాతి మీదని మండిపడ్డారు. వారి హయాంలో నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారిపై ఎక్కడలేని ప్రేమను చూపిస్తున్నారని, పదేళ్లు పేపర్ లీకేజీలు, టీఎస్పీఎస్సీ పేపర్ల అమ్మకం, పరీక్షల వాయిదాతో యువత జీవితాలతో చెలగాటం ఆడింది మీరుని ఆయన ఆరోపించారు.

Next Story