రాజా సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

by I. Sairam |   (  Updated:2026-01-10 12:19:36  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘రాజా సాబ్’(Raja Saab) మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

రాజా సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘రాజా సాబ్’(Raja Saab) మూవీ నిన్న థియేటర్లలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్–కామెడీకి తొలి షోల నుంచే కథనం, రన్‌టైమ్‌పై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ట్విట్టర్‌లో రాజాసాబ్ డిజాస్టర్ అని ట్రెండింగ్ కూడా అయింది. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టిందో చూద్దాం..

రాజా సాబ్ మూవీ తొలిరోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకు వచ్చాయట. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఏపీలో టికెట్ రేట్లు పెంపు కొనసాగుతుండగా.. తెలంగాణలో పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి వీకెండ్‌లో కలెక్షన్స్ పెరిగే అవకాశముందేమో చూడాల్సి ఉంది.

Read More..

రాజాసాబ్ థియేటర్‌లో అగ్నిప్రమాదం

Next Story