- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజాసాబ్ థియేటర్‌లో అగ్నిప్రమాదం
రాయగడలోని ఓ థియేటర్లో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్ లోనే బాణాసంచా పేల్చడంతో స్క్రీన్ ముందు ఉన్న కాగితాలపై టపాకాయలు పడి మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాజాసాబ్ పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒడిశాలో సైతం రిలీజ్ అయింది. కాగా రాయగడలోని ఓ థియేటర్లో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్ లోనే బాణాసంచా పేల్చడంతో స్క్రీన్ ముందు ఉన్న కాగితాలపై టపాకాయలు పడి మంటలు చెలరేగాయి.
దీంతో వెంటనే స్పందించిన థియేటర్ యాజమాన్యం, ప్రేక్షకులు వెంటనే మంటలు ఆర్పేశారు. స్క్రీన్, సీట్లకు మంటలు అంటుకుని ఉంటే పెను ప్రమాదం జరిగేదని థియేటర్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఎంజాయ్ చేయాలని కానీ ఇలాంటి పనులు చేస్తే కాలక్షేపం కోసం వచ్చే వాళ్ల ప్రాణాలు రిస్క్ లో పడతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ హీరో అభిమానులు అయితే పిచ్చి తగ్గించుకోవాలని చురకలు అంటిస్తున్నారు.






