- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలాంటి బట్టలైనా వేసుకోండి ఎక్కడైనా చావండి నాకేంటి.. అనసూయకు కౌంటర్ ఇచ్చిన శివాజీ
గత రెండు రోజుల నుంచి శివాజీ(Shivaji) పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

దిశ, సినిమా: గత రెండు రోజుల నుంచి శివాజీ(Shivaji) పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ కామెంట్స్‌పై అనసూయ నిత్యం పలు సంచలన పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ విషయంపై శివాజీ, అనసూయ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈవివాదాస్పద వ్యాఖ్యలపై శివాజీ అందరినీ క్షమాపణలు కోరినప్పటికీ ఎండ్ కార్డ్ పడడం లేదు. ఆయనపై హీరోయిన్లు పలు కౌంటర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ వివాదం కాస్త పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా అనసూయ రోజుకో పోస్టుతో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై శివాజీ ఓ ప్రెస్‌మీట్‌లో స్పందిస్తూ.. ‘‘మన తెలుగు యాంకర్లు గానీ, యాక్టర్లు కానీ మంచి బట్టలు వేసుకుని వస్తారు. సుమ, ఉదయభాను వంటి వారు సంప్రదాయంగా ఉంటారు. ఇక కొంతమంది యంగ్ హీరోయిన్స్ అందంగా, గ్లామర్‌గా కనిపించాలని మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటున్నారు.
దానికి నెటిజన్స్ నుంచి వచ్చే కామెంట్లు, సూచనలను బట్టి తమను తాము మార్చుకుంటారు. కానీ ఆ అమ్మాయి బయటనుంచి వచ్చిన అమ్మాయి. మనకు కూడా బాధ్యతలు ఉంటాయి కదా. నేనెవరిని హక్కులను హరించడానికి.. నేను ఎవరినీ పేరు పెట్టి అనలేదు. మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారని. కానీ ప్రజలు నన్ను బలి చేశారు. నాకేంటి అనసూయ గారు. నేను మిమ్మల్ని ఎందుకంటాను. నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా అండి? ఎలాంటి బట్టలైనా వేసుకోండి ఎక్కడైనా చావండి నాకేంటి అనసూయ(Anasuya) గారు. అసలు మీరు ఎందుకువచ్చారు దీంట్లోకి. నేను అన్నది బయటనుంచి వచ్చిన హీరోయిన్లు, మన వాళ్లు ఏదైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మంచి బట్టలు వేసుకోండని చెప్పాను. లేదంటే జనాలు ఎగబడతారని చెప్పాను. అది కూడా నిధి అగర్వాల్, సమంత సంఘటనలు చూశాకే అలా చెప్పాను. ఆ తర్వాత కొన్ని పదాలు వాడాను. అది నన్ను ఎన్నాళ్ళుబాధ పెడుతుందో తెలియదు. ఆ తర్వాత చాలా బాధ పడ్డాను నేనా ఈ పదం వాడిందని. నేను మనిషనే.. నాకూ కర్మలుంటాయి. పొరపాటు జరిగింది’’ అని అన్నారు.
Read More..
మరి అప్పుడేం చేశావ్.. శివాజీపై యాంకర్ అనసూయ మరో కౌంటర్
శివాజీపై మరోసారి ఫైర్ అయిన చిన్మయ.. మొత్తం మహిళా వర్గాన్నే అవమానపరిచారంటూ సంచలన పోస్ట్






