- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరి అప్పుడేం చేశావ్.. శివాజీపై యాంకర్ అనసూయ మరో కౌంటర్
యాంకర్ అనసూయ నటుడు శివాజీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల దండోరా సినిమా ఈవెంట్ లో శివాజీ తన మాటలపై స్పందించిన అనసూయ రుణం తీర్చుకుంటానని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: యాంకర్ అనసూయ నటుడు శివాజీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల దండోరా సినిమా ఈవెంట్ లో శివాజీ తన మాటలపై స్పందించిన అనసూయ రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఏదో ఒక రోజు అనసూయ నిధి అగర్వాల్ మాదిరిగా ఇబ్బంది పడుతుందని ఆ రోజు వెళ్లి తాను ఖండిస్తానని చెప్పాడు. కాగా శివాజీ కామెంట్స్ పై ఇప్పటికే స్పందించిన అనసూయ తాజాగా మరో ట్వీట్ చేసింది. రుణం తీర్చుకోవడానికి మీకు అవకాశం కావాలా.. ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే వచ్చి తప్పు అని చెబుతారా..? నన్ను ఇబ్బంది పెట్టించడానికి ఏమైనా పథకం రచిస్తున్నారా సార్..? మరి ఆ నటిని ఇబ్బంది పెట్టినప్పుడు ఇది తప్పురా అని మగవాళ్లను ఖండించలేదేంటి. బాధితురాలిని నిందించడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. నిధి అగర్వాల్ సైతం బాధితురాలినే విక్టిమ్ చేస్తున్నారు అంటూ శివాజీ వ్యాఖ్యలను తప్పు పట్టింది. చాలా మంది హీరోయిన్లు శివాజీ కామెంట్లను ఖండిస్తున్నారు.






