- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాజీపై మరోసారి ఫైర్ అయిన చిన్మయ.. మొత్తం మహిళా వర్గాన్నే అవమానపరిచారంటూ సంచలన పోస్ట్
నటుడు శివాజీ(Shivaji) ‘దండోరా’ఈవెంట్‌లో హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, సినిమా: నటుడు శివాజీ(Shivaji) ‘దండోరా’ఈవెంట్‌లో హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఆయన కామెంట్స్ గురించే చర్చించుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్ల బట్టలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. అందరూ తప్పుపట్టడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఆయనపై చిన్మయి, అనసూయ వంటి వారు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా.. మహిళా కమీషన్ సీరియస్ అయి క్షమాపణలు చెప్పాలనడంతో.. ఎట్టకేలకు శివాజీ తప్పు ఒప్పుకున్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చాడు. అలాగే ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణలు చెప్తూ.. ఇలాంటి సంఘటనలు ఇంతకుముందెన్నడూ జరగలేదని రెండు పదాలు తప్పుగా మాట్లాడనని అన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, ఈ విషయంపై మరోసారి స్పందించిన చిన్మయి(Chinmayi) ట్విట్టర్‌లో సంచలన పోస్ట్ పెట్టింది. ‘‘తన సొంత సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఒక దారుణ ఘటనలో, లూలూ మాల్‌లో పురుషుల గుంపు చేతిలో లైంగిక వేధింపులకు గురైన మహిళా నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. బాధితురాలిపై నింద వేయడం, ఆమె దుస్తుల్ని కారణంగా చూపించడం ద్వారా అసలు నేరస్తుల ప్రవర్తనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్టే అవుతుంది. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు.. సమాజంలో పాతుకుపోయిన స్త్రీద్వేష దృక్పథానికి అద్దం పడే మాటలుగా మారుతున్నాయి. అతను ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే, అంత ఎక్కువగా ఈ ఇండస్ట్రీలో మహిళలు ఎంత అసురక్షిత వాతావరణంలో పనిచేస్తున్నారో బయటపడుతోంది.
మహిళలపై జరిగే వేధింపులకు పురుషులే బాధ్యులన్న సత్యాన్ని పక్కనపెట్టి, వారి దుస్తులు, ప్రవర్తన అంటూ కారణాలు చూపడం ద్వారా నేరాన్ని సమర్థించే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ లేదు. ఇది బాధితుల్ని మౌనంగా ఉండేలా చేసే ప్రమాదకరమైన ఆలోచన. ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తుల వల్లే మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలాంటి ప్రభావవంతమైన వేదికలో ఉన్న వ్యక్తులు మాట్లాడే ప్రతి మాటకు సామాజిక బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ అది లేదు. మహిళల భద్రత, గౌరవం గురించి మాట్లాడాల్సిన చోట, వారిపైనే నిందలు మోపడం ద్వారా స్త్రీ వ్యతిరేక ఆలోచనలకు బలం చేకూర్చుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం ఒక నటిని మాత్రమే కాదు, మొత్తం మహిళా వర్గాన్ని అవమానపరిచేలా ఉంటాయి’’ అని రాసుకొచ్చింది.






