ఇంకా రెండు సర్‌ప్రైజ్‌లు దాచి ఉంచాం.. ‘మిరాయ్’ మూవీపై హైప్ పెంచేస్తున్న తేజా సజ్జా కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-09 07:02:44  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja), రితికా నాయక్(Ritika Nayak) కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai).

ఇంకా రెండు సర్‌ప్రైజ్‌లు దాచి ఉంచాం.. ‘మిరాయ్’ మూవీపై హైప్ పెంచేస్తున్న తేజా సజ్జా కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja), రితికా నాయక్(Ritika Nayak) కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్, శ్రియా శరణ్, జయరామ్, జగపతి బాబు, పవన్ చోప్రా, రాజేంద్రనాథ్ జుట్టికీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా రాబోతుండగా.. సెప్టెంబర్ 12న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘మిరాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న తేజ సజ్జా కీలక వ్యాఖ్యలు చేశాడు. 'మిరాయ్' సినిమాలో ఎమోషన్, యాక్షన్, అడ్వెంచర్, ఒక కొత్త వరల్డ్ ఉంటుంది. మీకు కావాల్సిన చిన్న డివోషనల్ టచ్ కూడా ఉంటుంది.

దాని కోసం రెండు సర్ప్రైజులు దాచి ఉంచాం. అది ఎవరో కూడా ఎవరికీ తెలియదు. నేను ప్రామిస్ చేస్తున్నా. చాలా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి సినిమా చేసాం. దయచేసి సినిమాని సపోర్ట్ చేయండి. థియేటర్స్ లో మాత్రమే చూడండి. సినిమా నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పి మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు ఆ బలాన్ని మాకు ఇస్తే మనం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సినిమాలు తీయగలం అని చూపించేలాంటి ప్రయత్నం ఫ్యూచర్ లో చేస్తాం. దయచేసి పైరసీని మాత్రం ఎవరూ ఎంకరేజ్ చేయకండి.

చాలామందికి పైరసీ ఎఫెక్ట్ ఏంటో తెలియదు. పైరసీ అనేది ఒకేసారి నాలుగైదు వందల మంది కష్టాన్ని దొంగతనం చేస్తున్నట్టు. ఎవరైనా చిన్న పిక్ పాకెట్ దొంగతనం చేస్తేనే చీప్ గా ఎలా చూస్తారు. మరి అలాంటప్పుడు ఇంత మంది కష్టాల్ని ఎవరైనా దొంగిలిస్తే చేస్తే అది కరెక్ట్ కాదు. అందరికీ విన్నవించుకుంటున్నా. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్లీజ్ థియేటర్స్ లో చూడండి. మనం థియేటర్లను బతికించాలి. మన సినిమా ఇండస్ట్రీని మనం బతికించాలి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

‘లిటిల్ హార్ట్స్’ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాని.. ఆసక్తికర ట్వీట్ వైరల్

Next Story