- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లిటిల్ హార్ట్స్’ సినిమాపై ప్రశంసలు కురిపించిన నాని.. ఆసక్తికర ట్వీట్ వైరల్
‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న మౌళి హీరోగా మారాడు.

దిశ, సినిమా: ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న మౌళి హీరోగా మారాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts). సాయి మార్తాండ్(Sai Marthand) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రశాంత్, రాజీవ్ కనకాల, అనిత్, చౌదరి, సత్య కృష్ణన్, కంచి, జై కృష్ణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో మౌళి సరసన శివాని నాగరం(Shivani Nagaram) హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ ప్రేక్షకుల మనసులు దోచేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా సినీ సెలబ్రిటీలను సైతం మెప్పిస్తోంది.
తాజాగా, ‘లిటిల్ హార్ట్స్’ మూవీపై నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ‘‘లిటిల్ హార్ట్స్ వల్ల చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకున్నాను. అఖిల్, మధు, ఖత్యాయని (నాకు స్పెల్లింగ్ సరిగ్గా తెలియదు ). మీరందరూ నా రోజును అద్భుతంగా మార్చారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పను కానీ ప్రస్తుతానికి ధన్యవాదాలు అని మాత్రమే చెబుతాను’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్‌కు మౌళి స్పందిస్తూ.. ‘‘చాలా థాంక్స్ నాని అన్నా. నీకు తెలికపోవచ్చు అన్న.. కాని పిల్ల జమీందార్ నుండి నేను మీకు చాలా అభిమానిని. ఈరోజు నుంచి మౌళి నాని డిహెచ్ఎఫ్ ఫరెవర్. ఈరోజు కొత్త చల్లంగి పెట్టుకుంటా.. ఏదొక రోజు నే “గోదా లో ఇటుక అవుతా” పక్కా’’ అని రిప్లై ఇచ్చాడు.
Read More..
ధనుష్ ‘ఇడ్లీ కడై’ ఆడియో లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. మూవీ మేకర్స్ పోస్ట్ వైరల్






