ధనుష్ ‘ఇడ్లీ కడై’ ఆడియో లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. మూవీ మేకర్స్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)స్వయం దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai).

ధనుష్ ‘ఇడ్లీ కడై’ ఆడియో లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. మూవీ మేకర్స్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)స్వయం దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai). ఈ సినిమాలో నిత్యామీనన్ ( Nithya Menon )హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, ఆర్.పార్తిబన్, పి.సముతిరకని, రాజ్‌కిరణ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్, రెడ్ జాయింట్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అయితే భారీ అంచనాల మధ్య ‘ఇడ్లీ కడై’ అక్టోబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో హైప్ పెంచేశాయి. నెల రోజుల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ వేడకను నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సెప్టెంబర్ 14న జరగబోతున్నట్లు ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

link

Next Story