Toxic release postponed: యుద్ధం ఎఫెక్ట్: ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా.. కొత్త తేదీ ప్రకటిస్తూ యష్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-04 05:25:36  IST  )

ఎన్నో ఏళ్ల కష్టాన్ని మార్చి 19న మీకు చూపించాలనుకున్నాం. కానీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధం వల్ల మా గ్లోబల్ రిలీజ్ ప్లాన్స్‌కు ఇబ్బంది కలిగేలా ఉంది.

Toxic release postponed:  యుద్ధం ఎఫెక్ట్: ‘టాక్సిక్’ సినిమా విడుదల వాయిదా.. కొత్త తేదీ ప్రకటిస్తూ యష్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యష్ అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే వార్తే అని చెప్పాలి. 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని యష్ నటిస్తున్న భారీ చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairytale for Grown-Ups) విడుదల వాయిదా పడింది. అసలు ప్లాన్ ప్రకారం, ఈ సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఈ సినిమాను జూన్ నెలకు వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించి సినీ ప్రియులకు షాకిచ్చారు. ‘‘టాక్సిక్ సినిమాను కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ కోసం కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం.

ఎన్నో ఏళ్ల కష్టాన్ని మార్చి 19న మీకు చూపించాలనుకున్నాం. కానీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధం వల్ల మా గ్లోబల్ రిలీజ్ ప్లాన్స్‌కు ఇబ్బంది కలిగేలా ఉంది. అందుకే మా భాగస్వాములు, ప్రేక్షకుల శ్రేయస్సు కోరి ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. జూన్ నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాం. మీ అవగాహన, సహనానికి మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ నిరంతర, ప్రేమ, మద్దతు కోసం ఎదురుచూస్తున్నాము. ‘టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల్లో ఇంగ్లీష్, భారతీయ భాషల్లో జూన్ 4 2026న విడుదల కానుంది. సినిమాల్లో కలుద్దాం’’ అని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా.. యశ్ ఈ సినిమాకు యాక్టర్‌గానే కాకుండా కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కావడంతో, విదేశాల్లో పరిస్థితులు బాగోలేనప్పుడు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

ఇరాన్-అమెరికా యుద్ధంపై ఆర్జీవీ షాకింగ్ రియాక్షన్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతానంటూ పోస్ట్


Next Story