- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెట్‌లో ఆ వ్యక్తికి చుక్కలు చూపించిన విశాల్ ప్రియురాలు.. షాకింగ్ కామెంట్స్ వైరల్
యంగ్ బ్యూటీ సాయి ధన్షిక (Sai Dhanshika)తన షూటింగ్ సెట్‌లో జరిగిన ఓ చేదు ఘటనను వెల్లడించి వార్తల్లో నిలిచింది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ సాయి ధన్షిక (Sai Dhanshika)తన షూటింగ్ సెట్‌లో జరిగిన ఓ చేదు ఘటనను వెల్లడించి వార్తల్లో నిలిచింది. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘యోగిడా’ చిత్ర షూటింగ్ కేరళలో జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపింది. షూటింగ్ విరామ సమయంలో ఒక వ్యక్తి సెల్ఫీ కోసం తన దగ్గరకు రాగా, అతను మద్యం మత్తులో ఉండటంతో సెల్ఫీ ఇచ్చేందుకు నిరాకరించానని చెప్పింది. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి, ధన్షిక అంకుల్‌పై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశాడట. తన కళ్ల ముందే తన మనిషిపై చేయి చేసుకోవడంతో ధన్షికకు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ వ్యక్తిని వెంటాడి పట్టుకున్న ధన్షిక, సెట్ లోనే అతడిని విచక్షణారహితంగా చితకబాదానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆత్మరక్షణ కోసం తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మెళకువలను ఉపయోగించి, సుమారు పది నిమిషాల పాటు అతడికి చుక్కలు చూపించానని.. ఆవేశంతో ఉన్న తనను కంట్రోల్ చేయడం యూనిట్ సభ్యులకు కూడా కష్టమైందని, చివరకు దర్శకుడు, హీరో కలిసి ఆమెను శాంతింపజేశారని వెల్లడించింది. ‘‘నా చుట్టూ ఉన్న వారికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను’’ అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై నెటిజన్లు పెళ్లి అయ్యాక విశాల్, సాయి ధన్షికకు నచ్చని పని చేస్తే మూడినట్లే అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
సాయి ధన్షిక వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరగబోతుంది. కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విశాల్(Vishal)తో ఏడడుగులు వేయబోతోంది. గతేడాది ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. నిజానికి అదే రోజున పెళ్లి జరగాల్సి ఉన్నప్పటికీ, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కావాలనే విశాల్ పట్టుదల కారణంగా వివాహాన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం ఆ భవనం పనులు తుది దశకు చేరుకోవడంతో, అతి త్వరలోనే ఈ స్టార్ కపుల్ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.






