సూపర్‌స్టార్ సతీమణి విజయనిర్మల జయంతి.. విజయశాంతి స్పెషల్ ట్వీట్ వైరల్

by Disha Web Desk 9 |
సూపర్‌స్టార్ సతీమణి విజయనిర్మల జయంతి.. విజయశాంతి స్పెషల్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: దివంగత సూపర్ స్టార్ కృష్ణ సతీమణి దివంగత విజయ నిర్మల గత ఏడాది జూన్‌లో మరణించి.. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని శోకసంద్రంలో పడేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్యగా ఇండస్ట్రీలో గొప్ప పేరు సంపాదించుకున్నారు. కేవలం తన భర్త కృష్ణతో కలిసి ఏకంగా 50 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు.

42 సినిమాలకు దర్శకత్వం వహించారు. 27 చిత్రాల రికార్డు కలిగిన ఇటలీ దర్శకురాలి పేరు చెరిపేసి గిన్నిస్‌ రికార్డుకెక్కారు. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు మహిళ విజయ నిర్మల కావడం విశేషం. ఇంతటి విజయాలను సాధించిన దివంగత విజయ నిర్మల పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిర్మలను తలచుకుంటూ టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయిక విజయశాంతి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

‘నన్ను కళాకారిణిగా విశ్వసించి సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్‌‌గా నా మొదటి తెలుగు సినిమాకు నన్ను నడిపించి, నాకు తరగని గెలుపు ధైర్యమిచ్చిన ఆంటీ విజయనిర్మల. మీ పై ఆ అభిమానం, ఆ గౌరవం, ఎప్పటికీ మర్చిపోలేను. పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ విజయశాంతి ఎప్పటికి’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

Read More..

నన్నే మోసం చేస్తావా అంటూ గళ్లా పట్టుకొని నిలదీసిన జబర్దస్త్ వర్ష!




Next Story

Most Viewed