నన్నే మోసం చేస్తావా అంటూ గళ్లా పట్టుకొని నిలదీసిన జబర్దస్త్ వర్ష!

by Disha Web Desk 9 |
నన్నే మోసం చేస్తావా అంటూ గళ్లా పట్టుకొని నిలదీసిన జబర్దస్త్ వర్ష!
X

దిశ, సినిమా: బుల్లితెర జబర్దస్త్ షో ఎంతోమందికి బతుకుదెరువు చూపించిన విషయం తెలిసిందే. సుడిగాడి, సుధీర్, రాకింగ్ రాకేష్, అభినయ క్రిష్ణ, ఫైమా, హాట్ యాంకర్ అనసూయ, రోహిణి, నూకరాజు, అవినాష్, గడ్డం నవీన్, ఆనంద్ ఇలా చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఫేమ్ దక్కించుకున్న కొంతమంది కమెడియన్లు ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.

అయితే జబర్దస్త్ ద్వారా కొన్ని లవ్ జంటలు కూడా తయారైన సంగతి తెలిసిందే. సుధీర్-రష్మి, పటాస్ ఫైమా-ప్రవీణ్ వీరితో పాటు వర్ష ఇమ్మాన్యుయేల్ కూడా లవ్ ట్రాక్ నడిపించారు. జస్ట్ షోను ఆకట్టుకునేందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారా? లేక నిజంగానే లవ్ లో ఉన్నారా? అని నెటిజన్లు ఇప్పటికి కన్ఫూజన్‌లోనే ఉన్నారు.

ఇకపోతే తాజాగా ఇమ్మాన్యుయేల్.. వర్షను మోసం చేసి మరో పెళ్లిని అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. దీంతో వర్ష.. ఇమ్మూను నిలదీస్తుంది. అయితే ఇదంతా స్కిట్ లో భాగంగా జరిగినా.. కాస్తా రియాలిటీ వెర్షన్ ను తలపించేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన మొత్తం ఎపిసోడ్ ఫిబ్రవరి 23 వ తేదీన ప్రసారం కానుంది.

Read More..

ఆ విషయంలో చాలా గిల్టీగా ఫీలయ్యానంటున్న సమంత.. ఎందుకో తెలుసా?

Next Story