ఆ విషయంలో చాలా గిల్టీగా ఫీలయ్యానంటున్న సమంత.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 6 |
ఆ విషయంలో చాలా గిల్టీగా ఫీలయ్యానంటున్న సమంత.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది. మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. అయితే సామ్ మయోసైటీస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. అంతేకాకుండా తొందరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని కూడా ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇటీవల తాను టేక్ 20 పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ వీడియోలను రిలీజ్ చేస్తానని చెప్తూ ప్రోమోను వీడియోను కూడా షేర్ చేసింది. తాజాగా, టేక్ 20 ఫస్ట్ ఎపిసోడ్‌ను సమంత షేర్ చేసింది. అందులో న్యూట్రీషనిస్టు అల్కేశ్‌ను పలు ప్రశ్నల ద్వారా సామ్ తన డౌట్స్ అన్ని అడగడంతో అతను సమాధానం చెప్పాడు. ఆటో ఇమ్మూన్ కేసుల గురించి అడగడంతో అల్కేశ్ స్పందిస్తూ.. తినే ఆహారం, పీల్చే గాలి ధరించే దుస్తులు వల్ల అలా జరగొచ్చని చెప్పాడు. దానికి సమంత.. నేను మంచి ఆహారం తింటున్నా. ఆరోగ్యంగా ఉన్నా ఇలాంటివి నా దరి చేరవు అని కొందరు అనుకుంటారు. ఇంతకుముందు నేను కూడా అలాగే అనుకున్నా.

ఈ జాబితాలో ఉన్నందుకు గిల్టీగా ఫీలయ్యా. నేను పొద్దున్నే లేచి వర్కౌట్స్ చేసేదాన్ని ఆరోగ్యకరమైనవి తినేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పలు విషయాలపై అల్కేశ్, సమంత మాట్లాడుకున్నారు. వీరిద్దరు హెల్త్ గురించి మాట్లాడుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఇది చాలా మంది ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు సమంత గొప్ప పని చేస్తుందని అంటున్నారు.

Read More..

సూపర్‌స్టార్ సతీమణి విజయనిర్మల జయంతి.. విజయశాంతి స్పెషల్ ట్వీట్ వైరల్




Next Story

Most Viewed