జనగణమన మూవీపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

by samatah |
జనగణమన మూవీపై  విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ల వచ్చిన సినిమా లైగర్. పాన్ ఇండియా లేవల్‌లో లైగర్ మూవీని తెరకెక్కించారు. దీనిపై నిర్మాత చార్మి, పూరీ జగన్నాథ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరి ఆశలన్నీ అడియాశలు చేస్తూ.. డిజాస్ట్‌ర్‌గా మిగిలి పోయింది లైగర్ మూవీ. అట్టర్ ప్లాప్ కావడంతో అటూ పూరీ ఇటు విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి.

ఇక వీరి కాంబినేషన్‌లో జనగనమణ మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో విజయ్ ఫ్యాన్స్.. పూరీ‌పై మండిపడుతున్నారు. విజయ్ మీరు ఆసినిమా నుంచి తప్పుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్న విజయ్ దేవర కొండ జనగణమన సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

సైమా ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండాను జనగణ మూవీ గురించి ప్రశ్నించగా, విజయ్ దానికి సమాధానం ఇస్తూ.. మనం వచ్చింది సైమాకి.. ఇక్కడ ఎంజాయ్ చేస్తే చాలు, జనగణమణ గురించి మర్చిపోండి అంటూ చెప్పారు. దీంతో విజయ్ జనగణమన మూవీ నుంచి తప్పుకున్నాడు. అందుకే ఈ కామెంట్స్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : 'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్‌కు రాజమౌళి ఎంత తీసుకున్నాడో తెలుసా?


Next Story