LIK సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన విఘ్నేష్ శివన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-15 05:38:47  IST  )

నాకు ఆర్థిక స్తోమత ఉంటే ఖచ్చితంగా సీక్వెల్ రాస్తాను, ఆ పని తప్పకుండా చేస్తాను అని విఘ్నేష్ తన మనసులోని మాటను బయటపెట్టారు

LIK సీక్వెల్ అప్డేట్ ఇచ్చిన విఘ్నేష్ శివన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. దర్శకుడు విఘ్నేష్ శివన్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ వివాదం, సీక్వెల్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నారు. మొదట ఈ సినిమాకు ‘LIC’ అని పేరు పెట్టాలని చిత్ర యూనిట్ భావించింది. 2024లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు, ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ LIC నుంచి వీరికి నోటీసులు వచ్చాయి. ఏడు రోజుల్లోగా పేరు మార్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఒకవేళ అదే పేరును వాడుకోవాలంటే ఏకంగా రూ. 112 కోట్ల రూపాయలు చెల్లించాలని సదరు సంస్థ డిమాండ్ చేసిందట. అంత భారీ మొత్తం ఇవ్వడం ఇష్టం లేక, విఘ్నేష్ శివన్ తెలివిగా 'C' బదులు 'K' అక్షరాన్ని చేర్చి టైటిల్‌ను ‘LIK’ గా మార్చారట.

ఈ క్రమంలో ఆయన LIP, LIT, LIF వంటి రకరకాల పేర్లను కూడా ఆలోచించినట్లు సరదాగా చెప్పుకొచ్చారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ, విఘ్నేష్ శివన్ ఈ కథపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీకి సీక్వెల్స్ తీసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎస్‌జే సూర్య, ప్రదీప్ రంగనాథన్ పాత్రలతో కథను రకరకాల కోణాల్లో అన్వేషించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. "నాకు ఆనాకు ఆర్థిక స్తోమత ఉంటే ఖచ్చితంగా సీక్వెల్ రాస్తాను, ఆ పని తప్పకుండా చేస్తాను" అని విఘ్నేష్ తన మనసులోని మాటను బయటపెట్టారుర్థిక స్తోమత ఉంటే ఖచ్చితంగా సీక్వెల్ రాస్తాను, ఆ పని తప్పకుండా చేస్తాను" అని విఘ్నేష్ తన మనసులోని మాటను బయటపెట్టారు. స్టార్ హీరోయిన్ నయనతార భర్తగా, టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు ఉన్న విఘ్నేష్ శివన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైటిల్ కోసం 112 కోట్లు అడగడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నేను ధనుష్ అలాంటి ఒప్పందం కుదుర్చుకున్నాం.. కారా డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Next Story