నేను ధనుష్ అలాంటి ఒప్పందం కుదుర్చుకున్నాం.. కారా డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

ధనుష్ నటిస్తున్న కారా చిత్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలు పంచుకున్నాడు దర్శకుడు విఘ్నేష్ రాజా.

నేను ధనుష్ అలాంటి ఒప్పందం కుదుర్చుకున్నాం.. కారా డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కారా’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ధనుష్ ‘కరసామి’ అనే పత్తి రైతు పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ధనుష్ సరసన ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నీ దగ్గర ఏదైనా ఆసక్తికరమైన కథ ఉండి, నాకు వినిపించాలనుకుంటే.. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నువ్వు నాతో కలిసి పనిచేయాలనుకుంటే, మనం ఒప్పందం కుదుర్చుకుని వెంటనే నిర్మాణాన్ని ప్రారంభిద్దాం అని ధనుష్ ఒకసారి నాతో అన్నారు. తర్వాత 2024లో ఈ సినిమా కథ నేను ఆయనకు వినిపించాను. మేము 2025లోనే చిత్రీకరణ స్టార్ట్ చేసినప్పటికీ కథా రచన (స్క్రిప్ట్) కోసం మాత్రం చాలా సమయం తీసుకున్నాము. దాదాపు 9 నెలల సమయం పట్టింది. అంతే కాకుండా స్క్రిప్ట్ పని పూర్తిగా కంప్లీట్ అయ్యేవరకు అగ్రీమెంట్ చేసుకోకూడదు అని ముందుగానే మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో, ప్రేక్షకులను మెప్పించడానికి కేవలం ఒక మంచి సినిమా తీస్తే సరిపోదు. మనం వారి అంచనాలను మించిపోయేలా రాణించాల్సి ఉంటుంది.. పూర్తిగా ఈ కథ పనులు పూర్తయ్యాకే దీనిపై అగ్రీమెంట్ చేసుకున్నాము’ అని చెప్పుకొచ్చారు.

Next Story