సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్యకు కలిసొస్తుందన్న వేణు స్వామి.. లక్ వచ్చే నెల ఇదే!

by Disha Web Desk 7 |
సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్యకు కలిసొస్తుందన్న వేణు స్వామి.. లక్ వచ్చే నెల ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలు గురించి చెబుతూ ఒక్కోసారి సంచలనం సృష్టిస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరో చనిపోతాడని, సమంత, చైతన్య విడిపోతారని ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే. చెప్పిన జాతకం నిజంగా నిజం కావడంతో ఈయన మాటలను నెటిజన్లు సైతం బాగా నమ్మడం మొదలు పెట్టారు. అయితే.. నాగచైతన్య, సమంత విడిపోతారని వేణు స్వామి చెప్పినప్పుడు.. వాళ్లు విడిపోయాకే నాగచైతన్య సినిమా విషయంలో ఒక పీక్స్ లోకి వెళ్లిపోతాడు.. సినిమా అవకాశాలు కూడా బాగా వస్తాయి అని చెప్పారు. కానీ అనుకున్నంత రీతిలో అయితే చైతన్యకు ఆఫర్లు రావడం లేదు. మరి దీనిపై వేణు స్వామి ఏమన్నారో తెలుసుకుందాం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి 2026 లోపు సినీ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్‌కు ప్రాణగండం ఉందంటూ చెప్పారు. ఈ క్రమంలోనే యాంకర్.. గతంలో కూడా నాగచైతన్య విషయంలో విడాకులు అయిపోయిన తర్వాత స్టార్ అయిపోతాడు.. సినిమా అవకాశాలు బాగా వస్తాయి అని చెప్పారు. కానీ రాలేదు కదా అని ప్రశ్నించగా.. దానికి వేణు స్వామి స్పందిస్తూ వచ్చే జనవరి నుంచి వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి జనవరి నుంచి అయిన నాగచైతన్య దశ మారుతుందేమోనని..!

Read more

తొడలు, నడుము చూపిస్తేనే అవకాశం ఇస్తారా! Archana Gautam

Next Story