తొడలు, నడుము చూపిస్తేనే అవకాశం ఇస్తారా! అర్చన

by Dishanational2 |
తొడలు, నడుము చూపిస్తేనే అవకాశం ఇస్తారా! అర్చన
X

దిశ, సినిమా: ‘బిగ్ బాస్ 16’ ఫేమ్, నటి అర్చన గౌతమ్.. సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. అంతేకాదు కొంతమంది సాయం తీసుకుంటున్న క్రమంలో తనను గైడ్ చేసిన విధానం గురించి కూడా పలు విషయాలు చెప్పుకొచ్చింది. ‘నేను పీజీ చదువుతున్నపుడు ఒక అమ్మాయి నా ఆలోచనలను అర్థం చేసుకుంది. సినిమా ఆడిషన్స్‌కి వెళ్లాలనుకుంటున్నారా? అని అడిగింది. నేను అవుననే చెప్పాను. దీంతో ‘నువ్వు ఏ ఆడిషన్ వెళ్లిన షార్ట్‌లు వేసుకుని నిర్మాతలకు కనిపించు. టాప్ కూడా అలాగే ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతావు’ అని చెప్పింది. ఒక్కసారిగా షాక్ అయ్యాను. పొట్టి బట్టలు వేసుకుంటే అవకాశం ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో కొంతమంది మహిళలు ఎదుర్కొ్న్న పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకున్నా. ఎట్టకేలకు కొద్ది రోజుల్లోనే టీవీ షోలో అవకాశం లభించింది. రోజుకు మూడువేలతో నా ప్రయాణం మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చింది

Read More... ‘విక్రమార్కుడు’ సినిమాలో రవితేజతో ఫైట్ చేసిన నటి నగ్న ఫొటోలు లీక్..



Next Story

Most Viewed