Salman Khan : వంశీ పైడిపల్లి యాక్షన్ మోడ్.. సల్మాన్, నయనతారల భారీ ప్రాజెక్ట్ లాంచ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-22 17:06:14  IST  )

ఒక నెల రోజుల పాటు సాగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సల్మాన్, నయనతారల మధ్య వచ్చే కీలకమైన డ్రామా సీన్లను వంశీ పైడిపల్లి చిత్రీకరించనున్నారట.

Salman Khan : వంశీ పైడిపల్లి యాక్షన్ మోడ్.. సల్మాన్, నయనతారల భారీ ప్రాజెక్ట్ లాంచ్!
X

దిశ, సినిమా: భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకు వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా, టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం #SVC63 షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.అయితే దిల్ రాజ్ క్లాప్ కొట్టి షూటింగ్‌కు ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న ఎస్ఆర్‌పిఎఫ్ గ్రౌండ్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. దాదాపు ఒక నెల రోజుల పాటు సాగే ఈ లాంగ్ షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు సల్మాన్, నయనతారల మధ్య వచ్చే కీలకమైన డ్రామా సీన్లను వంశీ పైడిపల్లి చిత్రీకరించనున్నారట. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికల్లా పూర్తి చేసి, ఈద్ 2027 కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లోకి నయనతార రావడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సల్మాన్ ఖాన్ మాస్ పవర్, నయనతార పెర్ఫార్మెన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు తన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను నిర్మిస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి స్వయంగా "ఇప్పుడే ప్రయాణం మొదలైంది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Read More..

శివాత్మిక రాజశేఖర్ బర్త్ డే సర్ ప్రైజ్.. అశోక్ గల్లా సినిమాలో అదిరిపోయే రోల్!

Next Story