శివాత్మిక రాజశేఖర్ బర్త్ డే సర్ ప్రైజ్.. అశోక్ గల్లా సినిమాలో అదిరిపోయే రోల్!

by Mallepaka Hamsa |

శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు వెల్కమ్ చెబుతూ అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

శివాత్మిక రాజశేఖర్ బర్త్ డే సర్ ప్రైజ్.. అశోక్ గల్లా సినిమాలో అదిరిపోయే రోల్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటి శివాత్మిక రాజశేఖర్. ‘దొరసాని’ సినిమాతో పద్ధతైన తెలుగు అమ్మాయిగా పరిచయమై, తన సహజసిద్ధమైన నటనతో అనతి కాలంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఆస్కారం ఉన్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం యంగ్ హీరో అశోక్ గల్లా సరసన ‘వింటారా సరదాగా’ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె ఈ సినిమాలో నటిస్తుందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా, మేకర్స్ మాత్రం చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు.

కానీ, తాజాగా శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు వెల్కమ్ చెబుతూ అధికారికంగా కన్ఫర్మ్ చేయడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక హీరో అశోక్ గల్లా కూడా ఆమెకు విషెస్ చెప్పడం విశేషం. కాగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఎప్పుడూ కంటెంట్ విషయంలో రాజీ పడవు. అలాంటి బ్యానర్‌లో శివాత్మిక లాంటి టాలెంటెడ్ నటి ఒక ముఖ్య పాత్రకు ఎంపికైందంటే, ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌లో ఏదో గొప్ప విషయం ఉండే ఉంటుంది. విజయ్ బుల్గానిన్ మెలోడీస్‌లో శివాత్మికపై చిత్రీకరించే పాటలు కూడా సినిమాకు మేజర్ హైలైట్ కానున్నాయి. మొత్తానికి, ‘వింటారా సరదాగా’ టీమ్ శివాత్మికను బర్త్ డే సర్ ప్రైజ్‌తో ఫుల్ జోష్‌లోకి తీసుకువచ్చారు. వెండితెరపై ఆమె తన నటనతో మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని ఉద్భవ్ రఘు తెరకెక్కిస్తుండగా.. శ్రీగౌరి ప్రియ అశోక్ గల్లా సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story