- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇల్లు అద్దె చెల్లించలేక.. తిరుపతిలో భిక్షమెత్తుకుంటున్న స్టార్ లేడీ కమెడియన్
కారణం ఏంటో తెలియదు కానీ.. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ నటులుగా కొనసాగినవాళ్లు ప్రస్తుతం దుర్బర జీవితాలు అనుభవిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కారణం ఏంటో తెలియదు కానీ.. సినిమాల్లో ఒకప్పుడు స్టార్ నటులుగా కొనసాగినవాళ్లు ప్రస్తుతం దుర్బర జీవితాలు అనుభవిస్తున్నారు. దీనికి ఎగ్జామ్ పూల్ వందల చిత్రాల్లో నటించిన రమాప్రభ, శ్రీలక్ష్మితో పాటు పలువురు ఆర్టిస్టులు ప్రస్తుతం కనీసం అవసరాలకు కూడా ఇబ్బందిపడే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్లలో పాకీజా అలియాస్ వాసుకి ఒకరు. అప్పట్లో ఈమె లేడీ కమెడియన్స్‌లో ఒకరిగా సత్తా చాటారు. ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రంలో వాసుకి రోల్ ఎంతగా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
తమిళంలో ఈ నటి 250 కు పైగా సినిమాలు చేశారు. ప్రస్తుతం ఈ కమెడియన్‌కు తినడానికి తిండి కూడా లేదు. చాలా సార్లు ఈమె దీనగాథను యూట్యూబ్ ద్వారా కూడా వెల్లడించింది. తాజాగా వాసుకి భిక్షం ఎత్తుకుంటూ తిరుపతిలో దుకాణాల ముందు కనిపించడంతో కొంతమంది ఆమెను గుర్తించి.. మందలించారట. ఇంటి అద్దె చెల్లించలేక అడుక్కుంటున్నానని బదులిచ్చిందట వాసుకి.
ఇవి కూడా చదవండి : అందానికి కొత్త నిర్వచనం చెప్పిన Amitabh Bachchan మనుమరాలు.. నెటిజన్లు ఫిదా






