అందానికి కొత్త నిర్వచనం చెప్పిన Amitabh Bachchan మనుమరాలు.. నెటిజన్లు ఫిదా

by Kodari Anjali |   (  Updated:2023-09-12 14:40:09  IST  )

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా అందానికి కొత్త నిర్వచనం చెప్పింది.

అందానికి కొత్త నిర్వచనం చెప్పిన Amitabh Bachchan మనుమరాలు.. నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా అందానికి కొత్త నిర్వచనం చెప్పింది. అంతేకాదు చిన్న వయసులోనే వియవంతమైన వ్యాపారవేత్తగా అవతరించడంపై కూడా ఓపెన్ అయింది. తాజాగా ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘చాలా ప్రత్యేక వసతులు, అవకాశాలున్న ఫ్యామిలీ నుంచి వచ్చాననే విషయాన్ని అంగీకరిస్తా. అయితే మిగతా స్టార్ కిడ్స్‌లా కాకుండా నటనకు దూరంగా ఉండాలనుకున్నా. నా లైఫ్‌లో ఏ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి వెనుకాడను. నిజం చెప్పాలంటే ఏ పనినైనా నా స్వంతంగా ప్రారంభించగలనని నమ్ముతా. 21వ ఏట వ్యాపారంలోకి రావడం విశేషమైనదే.

అయినప్పటికీ దీనికి వయసుకు మించిన బాధ్యత వహించాలి. ఎక్కడ దిగజారిపోకుండా మనల్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం’ అని చెప్పింది. ఇక అందానికి నిర్వచనం ఏమిటని అడిగినపుడు.. ‘నా దృష్టిలో నిజాయితీగా ఉండటమే అందం. ఈ రోజుల్లో మహిళా సాధికారత కోసం వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా చాలా మందికి వాయిస్ ఇచ్చింది. 25 ఏళ్ల వయసులోనే పోడ్‌కాస్ట్ ద్వారా అనేక సామాజిక సమస్యల గురించి గళం విప్పి మార్పు కోసం కృషి చేసేలా నన్ను ప్రోత్సహించింది’ అంటూ వివరించింది.

ఇవి కూడా చదవండి : ఇల్లు అద్దె చెల్లించలేక.. తిరుపతిలో భిక్షమెత్తుకుంటున్న స్టార్ లేడీ కమెడియన్


Next Story