- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒత్తిడిని భరించలేక ‘తలైవార్-173’ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. సుందర్ సి షాకింగ్ కామెంట్స్
నిజం చెప్పాలంటే ఈ సినిమా అంగీకరించిన వెంటనే నేను విపరీతమైన ఒత్తిడికి గురయ్యాను. గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అది తీసుకుంటూ సినిమాలు చేశాను.

దిశ, సినిమా: కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు దిగ్గజాలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ దశాబ్దాల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తలైవార్ 173 వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. ఈ సినిమా బాధ్యతలు మొదట స్టార్ డైరెక్టర్ సుందర్ సి కి దక్కాయి. అయితే, అనూహ్యంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సిబి చక్రవర్తి ఆ లక్కీ చాన్స్ కొట్టేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుందర్ సి, తాను ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుందర్ సి మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే ఈ సినిమా అంగీకరించిన వెంటనే నేను విపరీతమైన ఒత్తిడికి గురయ్యాను. గత 16 ఏళ్లుగా నాకు నచ్చినట్లుగా, ప్రేక్షకులకు ఏం కావాలో అది తీసుకుంటూ సినిమాలు చేశాను. కానీ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ ఉన్న సినిమాను డీల్ చేసే కెపాసిటీ నాకు లేదని నా మనసుకి అనిపించింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే క్రమంలో నా ఆలోచనలను ఇతరులకు ఒప్పించే సామర్థ్యం నాకు లేదనిపించింది" అని నిజాయితీగా ఒప్పుకున్నారు. తనలోని లోపాలను కూడా బయటపెడుతూ.. "నాకు స్టోరీని సరిగ్గా వివరించడం రాదు. ఎవరైనా మార్పులు చెబితే ఎదురు చెప్పకుండా వెంటనే సరే అనేస్తాను. ఇలాంటి పెద్ద సినిమా చేసేటప్పుడు అక్కడ నా ఒక్కడి నిర్ణయం నడవదు.
చాలా మంది అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సినిమాకు, ఆ ఇద్దరు లెజెండ్స్ ఇమేజ్‌కు నేను పూర్తిస్థాయిలో న్యాయం చేయలేనేమో అనే భయం కలిగింది. నా వల్ల సినిమా పాడవ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రారంభంలోనే తప్పుకున్నాను" అని చెప్పుకొచ్చారు.ఇది తన జీవితంలో తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయం అని సుందర్ సి ఆవేదన వ్యక్తం చేశారు. "రజినీకాంత్, కమల్ హాసన్‌లతో కలిసి పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. వారితో గడిపిన కొన్ని రోజుల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ముందే స్వయంగా రజినీకాంత్ గారిని కలిసి నా పరిస్థితి వివరించాను. ఆయనకు అంతా చెప్పాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను" అని వెల్లడించారు.సుందర్ సి తర్వాత సిబి చక్కవర్తి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చినా, ఆయన కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం అశ్వత్ మారిముత్తు చేతుల్లోకి వెళ్లిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఏదేమైనా, ఒక భారీ అవకాశాన్ని కేవలం క్వాలిటీ కోసం సుందర్ సి వదులుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోలకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫిదా.. క్రేజీ కామెంట్‌తో నెట్టింట ట్రోల్స్






