చైతూని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను.. సమంత ఫీలింగ్?

by Dishanational2 |
చైతూని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను.. సమంత ఫీలింగ్?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు విడిపోయినప్పటి నుంచి వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ మధ్య సినీ క్రిటిక్ సెన్సార్ బోర్డు మెంబర్ అయిన ఉమైర్ సందు టాలీవుడ్ నటీ నటులపై అలాగే బాలీవుడ్ నటీ నటులపై వివాదాస్పద వాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈయన సమంత, చైతూపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చైతూ సమంతకు అబార్షన్ చేయించాడు, మెంటల్‌గా టార్చర్ చేశాడు అందుకే వారు విడిపోయాడంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.

కాగా, మరోసారి ఈయన సమంత మనోగతం ఇదే అంటూ సంచలన ట్వీట్ చేశాడు. అక్కినేని ఫ్యామిలీ నైట్ పార్టీలకు వెళ్లనివ్వు, బోల్డ్ సినిమాల్లో నటించకూడదు, పొట్టి బట్టలు వేసుకోకూడదు. అంటూ, నాకు కట్టుబాట్లు పెట్టారు.అంతేకాదు ఆ కుటుంబంలోని వారు సంప్రదాయ వాదులు. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుండి ఒక పంజరంలో ఉన్న ఫీలింగ్ కలిగింది. అంతేకాదు ఇలాగే జీవితంలో సర్దుకొని పోతూ ఉంటే నా జీవితం మొత్తం నా చేతిలో ఉండదు వారు పెట్టిన కండిషన్లతోనే నా జీవితాన్ని కొనసాగించాలి అనే భావన నాకు కలిగింది.అసలు నేను నాగచైతన్యను పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోవు, ఆయన్ను పెళ్లి చేసుకొని నా జీవితంలో పెద్ద తప్పు చేశాను.. సమంత మనోగతం ఇదే అంటూ ఉమైర్ సందు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Also Read: సమంత జ్ఞాపకాలను దూరం చేసుకున్న నాగచైతన్య.. ఏం చేశాడంటే?

Next Story

Most Viewed