సమంత జ్ఞాపకాలను దూరం చేసుకున్న నాగచైతన్య.. ఏం చేశాడంటే?

by Dishanational2 |
సమంత జ్ఞాపకాలను దూరం చేసుకున్న నాగచైతన్య.. ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటి టాలీవుడ్ లవ్‌లీ కపుల్ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు సమంత, నాగచైతన్యనే. అలాంటి వారు తమ ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చి, మేము విడాకులు తీసుకుంటున్నామంటూ తెలిపారు. ఆ తర్వాత సమంత, నాగచైతన్యపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తున్నాయి. కొందరు విడాకులకు సమంతే కారణం అంటే, మరికొందరు నాగచైతన్య కారణం అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.కానీ సమంత, చైతూ మాత్ర వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు.

ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే,నాగచైతన్య మెల్లి మెల్లిగా సమంత జ్ఞాపకాలను దూరం చేసుకుంటున్నాడంట. సామ్,చై కలిసి ఉన్నప్పుడు, చైతన్యకు ఇష్టమైన ప్లాట్‌లో కలిసి ఉండే వారంట. అయితే విడిపోయిన తర్వాత చైతూ ఒక్కడే ఆ ఫ్లాట్‌లో ఉండేవాడు. అయితే తాజాగా నాగచైతన్య ఇళ్లు మారినట్లు చిత్ర పరిశ్రమలో గుస గుసలు వినిపిస్తున్నాయి.స‌మంత జ్ఞాప‌కాల‌కు దూరంగా ఉండేలా కొత్త ఇంటికి మారిన‌ట్టు సమాచారం.

Also Read: చైతూని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను.. సమంత ఫీలింగ్?

Next Story

Most Viewed