Sree Leela ను ఆ మూలన పడేశారేంటి బ్రో.. Viral Video

by Disha Web Desk |
Sree Leela ను ఆ మూలన పడేశారేంటి బ్రో.. Viral Video
X

దిశ, సినిమా : బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ‘భగవంత్ కేసరి’ మూవీలో శ్రీ లీల కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో బాలయ్య ఆమెకు బాబాయిగా కనిపించబోతుండగా.. కూతురిగా క్యూట్‌గా కనిపించబోతుంది శ్రీ లీల. ఇక వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి ‘గణేష్ ఆంథెమ్’ రిలీజ్ చేయగా.. వీరిద్దరూ పాటకు డ్యాన్స్ ఇరగదీశారు. కానీ పాపం ఈ బ్యూటీని ఓ మూలన పడేసి.. కేవలం హీరో మీదే కాన్సంట్రేట్ చేశాడు కొరియోగ్రాఫర్. మెయిన్ లీడ్‌గా బాబు డ్యాన్స్ చేస్తుంటే.. శ్రీ లీల మాత్రం ఓ పక్కన డ్యాన్స్ వేసుకుంటూ కనిపించేసరికి.. మీమర్స్‌కు దొరికిపోయినట్లయింది. అంత మంచి డ్యాన్సర్‌ను మూలకు నెట్టడం ఏంటి బ్రో అంటూ మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : ‘KALKI 2898 AD’ మూవీ టీం నుంచి లీగల్ కాపీరైట్ నోటీసు..


Next Story

Most Viewed