- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘KALKI 2898 AD’ మూవీ టీం నుంచి లీగల్ కాపీరైట్ నోటీసు..
ప్రభాస్ నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాల్లో ‘KALKI 2898 AD’ ఒకటి.

దిశ, సినిమా: ప్రభాస్ నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ బడా సినిమాల్లో ‘KALKI 2898 AD’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో చిత్రయూనిట్ అసహనం వ్యక్తం చేసింది. వైజయంతీ మూవీస్ చట్టపరమైన కాపీ రైట్ నోటీసు జారీ చేసింది.
‘‘KALKI 2898 AD’ మూవీకి సంబంధించిన కాపీ రైట్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌కు సోల్ అండ్ ఎక్స్‌క్లూజివ్ ఓనర్స్ వైజయంతీ మూవీస్ మాత్రమే. ఈ మూవీకి సంబంధించిన దృశ్యాలు, సంగీతం, ఫుటేజీ, స్టిల్స్, చిత్రాలతో సహా అన్ని అప్ డేట్స్ వైజయంతీ మూవీస్ నుంచి అందుతాయి. అలాకాదని సినిమాకి సంబంధించిన ఏదైనా సన్నివేశాలు, చిత్రాలు, ఫుటేజీలతో సహా ఫిల్మ్ మెటీరియల్స్‌లోని ఏదైనా సోషల్ మీడియా ద్వారా ఎవరైనా షేర్ చేస్తే కాపీరైట్ యాక్ట్ 1957 ఇతర చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరం. అటువంటి వ్యక్తులందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి’ అని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి : శ్రీ లీలను ఆ మూలన పడేశారేంటి బ్రో.. వీడియో వైరల్






