‘కరుప్పు’ మూవీ టీమ్‌పై త్రిష సెటైర్లు.. ఆ వివాదం కారణంగానే ఆమె ప్రమోషన్స్‌కు దూరంగా ఉందా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-02 07:17:51  IST  )

ధన్యవాదాలు.. నేను కూడా ఆ విషయాన్ని మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా మూవీ మేకర్స్ వారి రిమైండర్ సెట్ చేసినందుకు (వీడియో విడుదల చేసినందుకు) సంతోషం.

‘కరుప్పు’ మూవీ టీమ్‌పై త్రిష సెటైర్లు.. ఆ వివాదం కారణంగానే ఆమె ప్రమోషన్స్‌కు దూరంగా ఉందా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య,సౌత్ క్వీన్ త్రిష జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 14న విడుదల కాబోతోంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం, తాజాగా త్రిష పాత్రకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది.ఈ వీడియో ద్వారా త్రిష ఈ సినిమాలో ‘ప్రీతి’ అనే పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేశారు. 37 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో త్రిష కోర్టులో సీరియస్ లాయర్‌గా వాదిస్తూ కనిపిస్తుండగా, మరో సీన్‌లో ఆకుపచ్చ చీరలో డ్యాన్స్ చేస్తూ చాలా అందంగా మెరిసిపోయింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు త్రిష అందానికి, ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు. అయితే, ఈ వీడియో విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ఒక చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోపై స్పందించిన ఒక నెటిజన్.. "కరుప్పు సినిమాలో త్రిష ఉందనే విషయమే మర్చిపోయాను. ఆమె వయసు రివర్స్ గేర్‌లో వెళ్తోంది" అని కామెంట్ చేశాడు. దీనికి త్రిష స్పందిస్తూ, "ధన్యవాదాలు.. నేను కూడా ఆ విషయాన్ని మర్చిపోయాను. కనీసం ఇప్పటికైనా మూవీ మేకర్స్ వారి రిమైండర్ సెట్ చేసినందుకు (వీడియో విడుదల చేసినందుకు) సంతోషం" అంటూ చిత్ర యూనిట్‌ను ఉద్దేశించి చాలా వ్యంగ్యంగా బదులిచ్చారు. ఇది చూసిన వారందరికీ త్రిషకు, చిత్ర బృందానికి మధ్య ఏదో వివాదం తలెత్తినట్లు అర్థమైపోయింది.

త్రిష చేసిన కామెంట్ పై ఒక సూర్య అభిమాని మండిపడుతూ.. "ఆడియో లాంచ్‌కే రాని నీకు అంత వెటకారం అవసరమా?" అని ప్రశ్నించాడు. దీనిపై త్రిష ఏమాత్రం తగ్గకుండా అసలు నిజాన్ని బయటపెట్టారు. "నా ఇన్విటేషన్ బహుశా మెయిల్‌లో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుందిలే" అంటూ తనను ఆ వేడుకకే ఆహ్వానించలేదని ఇండైరెక్ట్‌గా వెల్లడించి బాంబు పేల్చింది. ఆడియో లాంచ్ పోస్టర్లలో ఆమె పేరు ఉన్నప్పటికీ, కనీసం ఫోన్ చేసి పిలవకుండా పోస్టర్ వేస్తే ఆమె ఎలా వస్తారని ఇప్పుడు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. త్రిష తన వ్యాఖ్యల ద్వారా ‘కరుప్పు’ టీమ్‌తో తనకు వివాదం ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అందుకే ఆమె సినిమా ప్రమోషన్స్‌కి కూడా దూరంగా ఉంటున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. స్టార్ హీరోయిన్‌ను పక్కన పెట్టి సినిమాను ప్రమోట్ చేయడం ఏమిటని కొందరు విమర్శిస్తుంటే, అసలు వీరి మధ్య గొడవకు కారణం ఏంటనేది ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లోకి తమన్ ఎంట్రీ.. AK-47 అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్

Next Story