- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లోకి తమన్ ఎంట్రీ.. AK-47 అంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్
ఈ పవిత్రమైన చిత్ర పౌర్ణమి రోజున మా మరో చార్ట్స్ బ్రేకింగ్ ప్రయాణం ప్రారంభమైంది. AK47" అంటూ త్రివిక్రమ్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. చాలా కాలం తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో జరుగుతున్న ప్రచారానికి తాజాగా తెరపడింది. మొదట ఈ చిత్రానికి ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శిష్యుడు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ రంగంలోకి దిగారు. తాజాగా చిత్ర పౌర్ణమి సందర్భంగా తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. "ఈ పవిత్రమైన చిత్ర పౌర్ణమి రోజున మా మరో చార్ట్స్ బ్రేకింగ్ ప్రయాణం ప్రారంభమైంది. AK47" అంటూ త్రివిక్రమ్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘హౌస్ నం 47’ అనేది ఉపశీర్షిక (ట్యాగ్‌లైన్). తమన్ తన పోస్ట్‌లో ‘AK47’ అని పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘ఆదర్శ కుటుంబం’ (AK) ట్యాగ్‌లైన్‌లోని ‘47’ కలిపి ఆయన అలా సంబోధించి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
‘కరుప్పు’ మూవీ టీమ్‌పై త్రిష సెటైర్లు.. ఆ వివాదం కారణంగానే ఆమె ప్రమోషన్స్‌కు దూరంగా ఉందా?






