- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్రిష ప్రభాస్ పెళ్లి చేసుకున్నారా..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన రిసెప్షన్ ఫొటోస్
వర్షం(Varsham), పౌర్ణమి(Pournami), బుజ్జిగాడు(Bujjigadu) సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జంట ప్రభాస్-త్రిష(Prabhas-Trisha).

దిశ, వెబ్‌డెస్క్: వర్షం(Varsham), పౌర్ణమి(Pournami), బుజ్జిగాడు(Bujjigadu) సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జంట ప్రభాస్-త్రిష(Prabhas-Trisha). వీళ్ళిద్దరూ కలిసి నటించిన ‘వర్షం’ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే అప్పట్లో ప్రభాస్ త్రిష లవ్ చేసుకుంటున్నారని, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారని చాలా గాసిప్స్ వినిపించాయి.
కానీ ఆ వార్తలపై ఈ జంట స్పందించలేదు. అయితే మధ్యలో ఇండస్ట్రీకి దూరమైన త్రిష ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతోంది. అప్పటికంటే ఇప్పుడు మరింత అందంగా తయారయి ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. వైరల్ అవుతున్న ఫొటోలో త్రిష-ప్రభాస్ కొత్తగా మ్యారేజ్ అయిన జంటలా దర్శనమిచ్చారు.
అంతేకాకుండా రిసెప్షన్‌లో చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇక ఈ జంటను ఆశీర్వదించడానికి హీరో నాగ చైతన్య(Naga Chaitanya) తన భార్య శోభిత(shobitha)తో వచ్చారు. అలాగే రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun), మహేష్ బాబు(Mahesh Babu), నాగార్జున(Nagarjuna), వెంకటేష్(Venkatesh), నాని(Nani), ప్రకాష్ రాజ్(Prakash Raj) వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఇవి ఏఐ జనరేటర్ పిక్స్ అని బట్ చూడడానికి ఈ జంట చాలా బాగుందని, రియల్ లైఫ్‌లో కూడా మీరిద్దరు పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వెంకటేష్ సినిమాలోని ఆ క్యారెక్టర్ వల్లే నేను నటనకు దూరమయ్యాను.. స్మిత షాకింగ్ కామెంట్స్






