వెంకటేష్ సినిమాలోని ఆ క్యారెక్టర్ వల్లే నేను నటనకు దూరమయ్యాను.. స్మిత షాకింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-12-17 12:45:29  IST  )

తెలుగు పాప్‌ సాంగ్స్‌‌తో స్టార్ డమ్ అందుకున్న స్మిత(Smitha) మనందరికీ సుపరిచితమే.

వెంకటేష్ సినిమాలోని ఆ క్యారెక్టర్ వల్లే నేను నటనకు దూరమయ్యాను.. స్మిత షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు పాప్‌ సాంగ్స్‌‌తో స్టార్ డమ్ అందుకున్న స్మిత(Smitha) మనందరికీ సుపరిచితమే. సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ లాంటి ప్లాట్‌ఫామ్‌లు లేని రోజుల్లో కూడా తన ఆల్బమ్‌లతో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే స్టార్టింగ్‌లో ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిన్నది ఫైనల్‌ విజేతగా నిలవకపోయినా, ఆమె గొంతుకు వచ్చిన పేరు అవకాశాల రూపంగా మారింది. అలా స్మిత ‘హాయ్‌ రబ్బా’ ఆల్బమ్‌తో ఒక్కసారిగా స్టార్‌ అయిపోయారు. ఆ తర్వాత వరుసగా పలు మ్యూజిక్‌ ఆల్బమ్‌లు చేసి తెలుగు పాప్‌ క్వీన్‌గా నిలిచారు.

అంతేకాకుండా మరోపక్క బిజినెస్‌ను చూసుకుంటూ కూడా తన సత్తా చాటుతున్నారు. అలాగే జీ తెలుగు ‘సరిగమప’ పాటల పోటీలో జడ్జ్‌గా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉంటే.. సింగర్‌గా సక్సెస్‌ అందుకున్న స్మిత, పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. అలా విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘మల్లీశ్వరి’(Malleswari), అక్కినేని నాగార్జున(Nagarjuna) నటించిన ‘కింగ్‌’(King) సినిమాల్లో కనిపించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే మంచి అవకాశాలు వస్తున్న టైంలోనే ఆమె సినిమాలకు సడెన్‌గా గుడ్‌బై చెప్పడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై స్మిత స్పందించి క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మిత మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో డైరెక్టర్లు కథ చెప్పేటప్పుడు ఒకలా, షూటింగ్‌ సమయంలో మరోలా మారుస్తారనే అనుభవం నాకు ఎదురైంది. ముఖ్యంగా ‘మల్లీశ్వరి’ సినిమాలో నా పాత్ర విషయంలో మొదట చెప్పిన విధంగా కాకుండా, చివరకు తెరపై మరోలా చూపించారు. ఇక ఆ ఒక్క అనుభవం నన్ను తీవ్రంగా బాధించింది. దీంతో ఇక సినిమాల్లో నటించకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాను. అందుకే నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో కొనసాగలేనని భావించి సిల్వర్‌ స్క్రీన్‌కు దూరమయ్యాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story