సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ విమర్శలు.. నన్నే రిజెక్ట్ చేసారు!

by velandi.Saikiran |

సౌత్ ఇండస్ట్రీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు హీరోయిన్ తాప్సీ.

సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ విమర్శలు.. నన్నే రిజెక్ట్ చేసారు!
X

దిశ‌, వెబ్ డెస్క్: బడా హీరోయిన్ తాప్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ.. దూసుకు వెళ్తున్నారు. ఎప్పుడో ఒకసారి స్పెషల్ పాత్రలు వస్తే తప్ప, తెలుగులో కనిపించడం లేదు. అయితే అలాంటి హీరోయిన్ తాప్సీ.. సౌత్ ఇండస్ట్రీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు వివక్ష ఎదుర్కొన్నానని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

సీనియర్ల పక్కన నటిస్తే, యంగ్ హీరోలు తనతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు వెనకాడే వారంటూ పేర్కొన్నారు. మరో వైపు ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే రొమాంటిక్, కామెడీ సినిమాలకు వయసు సరిపోదని చెప్పారని ఆమె వెల్లడించారు. ఈ వయో వివక్ష మహిళలకు మాత్ర‌మే ఎదురవుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోలకు మాత్రం ఇలాంటి సమస్యలు ఏమీ లేవని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Next Story