- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేసిన సూర్య !
ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ను సూర్య కుమార్ యాదవ్ అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ 2026 ముగిసిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ను సూర్య కుమార్ యాదవ్ అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అతని బయోలో కూడా ముంబై ఇండియన్స్ పేరు తొలగించాడని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ న్యూస్ వైరల్ అయిన తరుణంలో క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 కెప్టెన్సీ పోయిన నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ డిప్రెషన్ లోకి వెళ్లాడని అంటున్నారు. అందుకే ముంబై ఇండియన్స్ కు కూడా గుడ్ బై చెప్పి.. రిటైర్మెంట్ ప్రకటిస్తాడని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. వేరే ఫ్రాంచైజీ నుంచి సూర్యకు బంపర్ ఆఫర్ తగిలినట్లు ఉందని.. అందుకే ముంబై ఇండియన్స్ అకౌంట్ అన్ ఫాలో చేశాడని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. కాగా తాజాగా సూర్య కుమార్ యాదవ్ కు షాక్ ఇస్తూ.. టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియామకం చేసింది బీసీసీఐ. కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. భారత జట్టులో స్థానం కూడా సూర్యకు ఇవ్వలేదు. కెప్టెన్ గా సక్సెస్ అవుతున్న సూర్య... ప్లేయర్ గా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.






