- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. వణికిపోయిన మిండనావో తీరం
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో తీరంలో 8.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫిలిప్పీన్స్ (Philippines)లోని దక్షిణ ప్రాంతంలో ఇవాళ ఉదయం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. పసిఫిక్ మహాసముద్ర గర్భంలో సంభవించిన ఈ ప్రలయకంపం కారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తీర ప్రాంతాలకు అత్యవసర సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతో నమోదైనట్లుగా పేర్కొంది. భూకంప కేంద్రానికి 300 కి.మీ పరిధిలో ఉన్న ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తీరాలకు సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. సముద్ర అలలు సాధారణ స్థాయి కంటే ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడే ప్రమాదం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
మరోవైపు ఇండోనేషియా వాతావరణ సంస్థ (BMKG) కూడా ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.7గా లెక్కించి, తమ దేశంలోని ఉత్తర సులవేసి తీర ప్రాంతాలకు సునామీ అలర్ట్ జారీ చేసింది. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ఫిలిప్పీన్స్‌లోని సరంగాని ప్రావిన్స్, మిండనావో దీవుల్లో భూమి తీవ్రంగా కంపించింది. నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. పలుచోట్ల భవనాలు కూడా కుప్పకూలాయి. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, భూగర్భ పలకల కదలికలు ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) జోన్‌లో ఉన్నాయి. దీంతో అక్కడ తరచూ భారీ భూకంపాలు, అగ్ని పర్వత విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.






