ఏన్కూర్ మండలానికి ఎంఈవోను నియమించండి కలెక్టర్ సార్..!?

by Jakkula.Mamatha |

పాఠశాల ప్రారంభ దశలో మండలానికి ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం ఎలా పెరుగుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏన్కూర్ మండలానికి ఎంఈవోను నియమించండి కలెక్టర్ సార్..!?
X

దిశ, ఏన్కూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ అడ్మిషన్స్ పెంచాలని పదేపదే చెప్తుంటే.. పాఠశాల ప్రారంభ దశలో మండలానికి ఎంఈఓ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం ఎలా పెరుగుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో పనిచేసిన ఎంఈఓ మే 31వ తేదీకి పదవీ విరమణ చేయడంతో కొత్తవారిని నియమించాల్సిన అవసరం ఉన్నప్పటికీ అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో పోస్టు ఖాళీగా ఉంది.

దీంతో ప్రభుత్వ విద్య గాడి తప్పే పరిస్థితి ఉందని పలువురు విద్యా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ ఉండాలంటే తక్షణమే ఎంఈఓ పోస్టును భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ సార్ ను మండల ప్రజలు వేడుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో వారిని కట్టడి చేయడానికి మండల విద్యాశాఖ అధికారి పోస్ట్ ఖాళీగా ఉండటం విద్యార్థుల తల్లిదండ్రులకు పెద్ద భారంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తరుణంలో ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ తో పాటు ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పై కట్టడి చేయాలంటే తక్షణమే ఎంఈఓ పోస్టును భర్తీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.

Next Story