- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోల్డ్ లవర్స్ పండగ చేస్కోండి..! 5 రోజుల్లోనే ఏకంగా రూ.7,950 పతనం
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయమని బిజినెస్ ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు. కొన్ని రోజులుగా పెరిగిన పసిడి ధరలు.. ఇప్పుడు క్రమంగా కిందకు దిగివస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై ఏకంగా రూ.1,040 పతనమైంది. దీంతో నిన్నటి వరకు ఉన్న ధరల నుంచి తగ్గుతూ ప్రస్తుతం రూ. 1,51,690 మార్కుకు చేరింది. కేవలం 5 రోజుల్లోనే తులం బంగారం ధరపై ఏకంగా రూ.7,950 మేర తగ్గడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు ధరపై రూ.950 తగ్గి, ప్రస్తుతం మార్కెట్‌లో రూ.1,39,050 వద్ద పలుకుతోంది.
సిల్వర్ ధరల్లో నో ఛేంజ్..
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా దిగొచ్చినప్పటికీ ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి వేర్వేరు ప్రాంతాలను బట్టి, స్థానిక పన్నులు మరియు జ్యువెలరీ మేకింగ్ ఛార్జీల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ మళ్లీ మొదలైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.






