అందరి సహకారంతోనే అభివృద్ధి: ఎంపీడీవో

by Jakkula.Mamatha |

గ్రామస్తుల సహకారంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, ఎంపీడీవో రాజీరెడ్డి అన్నారు.

అందరి సహకారంతోనే అభివృద్ధి: ఎంపీడీవో
X

దిశ, నిజాంపేట: గ్రామస్తుల సహకారంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, ఎంపీడీవో రాజీరెడ్డి అన్నారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో శనివారం ఉప సర్పంచ్ కుమార్, కార్యదర్శి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడారు. తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై వివిధ సూచనలు చేశారు. ఇంకుడు గుంతలు నిర్మించుకొని నీటిని సంరక్షించుకోవాలన్నారు. అలాగే పారిశుధ్యం పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, ఏపీఎం అశోక్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, కానిస్టేబుల్ నవీన్, గ్రామస్తులు పాతూరి బాల్ రెడ్డి, భూపతి రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story