- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL: వారెవ్వా క్యా సీన్ హై..! పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు
భార్య పుట్టింటికి వెళ్తే కన్నతల్లికే తాళి కట్టబోయిన అల్లుడు. కాన్పూర్ దేహాత్ కోర్టులో మొదటి భార్య ఊహించని ఎంట్రీ..

దిశ, వెబ్‌డెస్క్: మానవ సంబంధాలు రోజురోజుకూ కనుమరుగుతున్నాయి. వావివరుసలు మరిచి ఓ అల్లుడు, అత్త కలిసి చేసిన పని దేశ ప్రజలను ముక్కున వేలేసుకొనేలా చేసిన షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ దేహాత్ (Kanpur Dehat) జిల్లాలో వెలుగు చూసింది. భార్యతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిన గ్యాప్‌లో.. ఓ కిలాడీ అల్లుడు ఏకంగా తన సొంత అత్తతోనే లవ్ ట్రాక్ నడిపాడు. అంతటితో ఆగకుండా ఇద్దరూ కలిసి కోర్టులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవగా మొదటి భార్య ఊహించని ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది.
పెళ్లాం పుట్టింటికెళ్తే.. అత్తతో ప్రేమ
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడైన అల్లుడికి కొన్నేళ్ల క్రితమే వివాహం కాగా, భార్యతో పొద్దున లేస్తే తరచూ పంచాయితీలే జరగేవి. ఈ క్రమంలోనే భార్య కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ సమయంలో భార్యను బుజ్జగించి ఇంటికి తెచ్చుకోవాల్సిన మొగుడు.. అత్తగారింటికి వెళ్లి ఆమెతోనే ఏకంగా అఫైర్ పెట్టేసుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసలు మరిచిన ఆ అత్త, అల్లుడు లీగల్‌గా పెళ్లి చేసుకుని ఒకటైపోవాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఎవరికీ తెలియకుండా.. గప్‌చుప్‌గా రిజిస్టర్ మ్యారేజ్ (Registered Marriage) చేసుకోవడానికి ఆ జంట కాన్పూర్ దేహాత్ కోర్టుకు చేరుకుంది. అయితే, ఈ వింత పెళ్లి తంతు కాస్తా మొదటి భార్య అంటే అత్త కూతురు చెవిన పడింది. కన్నతల్లి, కట్టుకున్న మొగుడు కలిసి తనకు ఇంత పెద్ద ద్రోహం చేస్తున్నారని తెలిసి ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే తన బంధువులను వెంటబెట్టుకుని కోర్టుకు వచ్చింది. అక్కడ పెళ్లి పత్రాలపై సంతకాలు పెట్టిన అత్త, అల్లుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
జుట్లు జుట్లు పట్టుకుని రచ్చ.. రచ్చ
అనంతరం కోర్టు ఆవరణలోనే మొదటి భార్య, ఆమె బంధువులు కలిసి అత్త, అల్లుడిని నడిరోడ్డుపై నిలదీశారు. మాట మాట పెరిగి ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చేటుచేసుకుంది. కోపంతో ఒకరినొకరు నెట్టేసుకుంటూ, జుట్లు జుట్లు పట్టుకుని రోడ్డుపైనే దారుణంగా కొట్టుకున్నారు. వరుసలు మరిచిన ఆ జంటకు భార్య తరఫు బంధువులు, స్థానికులు కలిసి గట్టిగా దేహశుద్ధి చేశారు. కోర్టు ప్రాంగణంలో ఈ హైడ్రామా చూసేందుకు జనం భారీగా ఎగబడగా.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఇరు వర్గాలను కంట్రోల్ చేశారు. ఆ తర్వాత అత్త, అల్లుడితో పాటు మొదటి భార్యను పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపేశారు. ప్రస్తుతం కోర్టులో అత్త, అల్లుడు దండలు మార్చుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






