‘అనుమాన పక్షి’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

by Pulgam srinivas |

‘అనుమాన పక్షి’ టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

‘అనుమాన పక్షి’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాగ్ మయూర్ హీరోగా, ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘అనుమాన పక్షి’. తాజాగా ఈ మూవీ బృందం టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘డీజే టిల్లు’ వంటి సూపర్ బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ‘అనుమాన పక్షి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తుండగా, ప్రిన్స్, బ్రహ్మాజీ, రాశి, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు.




Next Story