HCA అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-08 07:39:59  IST  )

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో తెలంగాణ హైకోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చింది.

HCA అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు అమర్‌నాథ్ (Amarnath) ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు (High Court) సంచలన తీర్పును వెలువరిచింది. అతడిని వెంటనే బాధ్యతల నుంచి తొలగించాలని, ఏజీఎం సెక్రటరీ స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని వెంటనే ఎన్నికోవాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

కాగా, 2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అమర్‌నాథ్ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో (62-63) నాటి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు (Jaganmohan Rao)చేతిలో ఓడిపోయారు. అయితే, జగన్‌మోహన్ రావు ‘శ్రీ చక్ర క్లబ్’ పేరుతో సమర్పించిన పత్రాలు నకిలీవని అమర్‌నాథ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా 2018లోనే అంబుడ్స్‌మన్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి (L. Narasimha Reddy) గౌలీపురా పేరును శ్రీ చక్ర సీసీగా మార్చడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చారని కాబట్టి ఆ క్లబ్ ఉనికిలో లేదని అమర్‌నాథ్ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ లేఖ రాశారు. దీంతో హెచ్‌సీఏ కార్యకలాపాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో 62 ఓట్లతో రన్నరప్‌గా నిలిచిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తూ జస్టిస్ కైత్ ప్రకటించారు. అయితే, తాజాగా అమర్‌నాథ్ ఎన్నిక చెల్లదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. కేసులో ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఆయన ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది.

Next Story