థాయ్‌లాండ్‌లో ‘లేడీబాయ్స్’ ఘోరాలు.. ఇండియన్ టూరిస్టులే మెయిన్ టార్గెట్

by Kema Shiva Kumar |

థాయ్‌లాండ్‌లో రాత్రి వేళల్లో లేడీబాయ్స్ ముఠాలు విదేశీ టూరిస్టుల నుంచి బలవంతపు వసూళ్లు, దాడులకు పాల్పడుతున్నారు.

థాయ్‌లాండ్‌లో ‘లేడీబాయ్స్’  ఘోరాలు.. ఇండియన్ టూరిస్టులే మెయిన్ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పర్యాటకులకు టూరిస్ట్ డెస్టినేషన్ థాయ్‌లాండ్. తక్కువ ఖర్చు, సులభమైన వీసా నిబంధనల కారణంగా ఏటా లక్షలాది మంది ఇండియన్స్ బ్యాంకాక్ (Bangkok), పట్టాయా (Pattaya), ఫుకెట్ (Phuket) నగరాలకు క్యూ కడుతుంటారు. అయితే, ఇటీవల కాలంలో అక్కడ భారత పర్యాటకులను టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న మోసాలు, హరాస్‌మెంట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో తిరిగే ఒంటరి పురుషులను టార్గెట్ చేస్తూ కొన్ని ‘లేడీబాయ్స్’ (Ladyboys) ముఠాలు భారీ వసూళ్లకు, బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. అందులో ఓ భారతీయ యువకుడిని లేడీ బాయ్స్ అంతా కలిసి కొడుతున్నట్లుగా ఉంది.

భారతీయులే ఎందుకు..

థాయ్‌లాండ్‌లోని అక్కడి స్కామర్లు, లేడీబాయ్స్ గ్రూపులు ఎక్కువగా భారత టూరిస్టులే టార్గెట్‌గా మోసాలకు పాడ్పడుతున్నారు. అందుకు కారణం ఇండియన్స్ ఆర్థికంగా స్థిరపడిన వారని, వారి వద్ద ఎక్కువ నగదు ఉంటుందని వారు భావిస్తుంటారు. వీటన్నింటికీ మించి సాధారణంగా వివాదాలకు, గొడవలకు దూరంగా ఉంటారని, విదేశాల్లో పోలీసుల దాకా వెళ్లడం ఇష్టం లేక అడిగినంత డబ్బు ఇచ్చేసి సమస్య నుంచి బయటపడాలని చూస్తారనే బలహీనతను ఈ ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి.

హరాస్‌మెంట్, స్కామ్స్ జరిగే తీరు ఇలా..

థాయ్‌లాండ్‌లోని పర్యాటక ప్రాంతాల్లో, నైట్ మార్కెట్లలో కొందరు లేడీబాయ్స్ పర్యాటకుల దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీగా నటిస్తూ, బలవంతంగా ఫొటోలు, సెల్ఫీలు దిగుతారు. ఆ తర్వాత ఒక్కో ఫొటోకు వేలల్లో థాయ్ బాత్స్ డిమాండ్ చేస్తారు. ఇవ్వడానికి నిరాకరిస్తే, గుంపుగా చేరి నడిరోడ్డుపైనే హంగామా చేస్తూ, శారీరక దాడికి కూడా వెనకాడటం లేదు. అదేవిధంగా రోడ్లపై నడుస్తున్న పర్యాటకులను గమనించి మాటలు కలిపి, తక్కువ ధరకే డ్రింక్స్, మసాజ్ ఇప్పిస్తామని నమ్మించి లోకల్ బార్లలోకి తీసుకెళ్తారు. తీరా అక్కడికి వెళ్లాక వేలల్లో బిల్లు వేయించి ఆ బిల్లు కట్టేంత వరకు సదరు పర్యాటకుడిని గదిలోనే బంధించి, తీవ్రంగా హరాస్ చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక లేట్ నైట్ ఒంటరిగా నడుస్తున్న పర్యాటకులను కౌగిలించుకోవడానికి (Hug) ప్రయత్నిస్తూ, వారి దృష్టి మళ్లించి మెడలోని బంగారు గొలుసులు, జేబులోని వాలెట్, మొబైల్ ఫోన్లను క్షణాల్లో కొట్టేస్తుంటారు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్‌లో పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ (Tourist Police) విభాగాన్ని ఏర్పాటు చేశారని భారత విదేశాంగ తెలిపింది. అందులో పనిచేసే వారికి ఇంగ్లీష్ భాష కూడా వచ్చిని. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే 1155 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చిన అధికారులు పేర్కొన్నారు.

Next Story