- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూపల్లిలో అక్రమంగా మట్టి తరలింపు : గ్రామస్తుల అడ్డగింత
చారకొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామ శివారులో ఉన్న చింత చెరువు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా నల్లమట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

దిశ, చారకొండ : చారకొండ మండల పరిధిలోని జూపల్లి గ్రామ శివారులో ఉన్న చింత చెరువు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా నల్లమట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలింపు జరుగుతుండగా, సమీప రైతులు దీనిని గమనించి 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం ఏకంగా పట్టపగలే జేసీబీ, టిప్పర్ల సహాయంతో ఇటుకల తయారీ కోసం మట్టిని తరలిస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో రైతులు, గ్రామస్తులు కలిసి మట్టి తరలింపును అడ్డుకుని ఆందోళన చేపట్టారు.
అనంతరం చారకొండ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని అక్రమ మట్టి తరలింపును నిలిపివేశారు. సంబంధిత అనుమతులు ఉన్నప్పుడే మట్టిని తరలించాలని సూచిస్తూ వాహనాలను అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులో మట్టి తవ్వకాల వల్ల సమీప పొలాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులో అధిక లోతులో తవ్వకాలు నిర్వహించడం వల్ల సమీప వ్యవసాయ భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాల పై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






