- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైళ్లశాఖ పెట్రోల్ బంక్‌లో భారీ అవినీతి.. ఆడిటింగ్ లో వెలుగుచూసిన అక్రమాలు
జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ లో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. నంద్యాలజిల్లా బనగానపల్లెలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్ లో ఏకంగా రూ.74 లక్షల అవినీతి జరిగినట్లు తేలింది.

దిశ, వెబ్‌డెస్క్: జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ లో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. నంద్యాలజిల్లా బనగానపల్లెలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్ లో ఏకంగా రూ.74 లక్షల అవినీతి జరిగినట్లు తేలింది. కొంతకాలంగా లెక్కల్లో తేడాలు వస్తుండటాన్ని గమనించిన జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఆడిటింగ్ నిర్వహించారు. పెట్రోల్ బంక్ లావాదేవీలపై ఇటీవల ఆడిట్ నిర్వహించగా.. అందులో ఈ భారీ అవినీతి బట్టబయలైంది. బంక్ నిర్వహణ చూసుకుంటున్న హెడ్ వార్డర్ రామచంద్రారెడ్డి ఖాతాలోకి డబ్బును మళ్లించినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఏడాదికాలంగా పెట్రోల్ బంక్ కు ఫోన్ పే ద్వారా వచ్చే డబ్బును హెడ్ వార్డర్ తన ఖాతాకు మళ్లించుకున్నట్లు తేల్చారు. దీంతో రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెట్రోల్ బంక్ కు వచ్చే వాహనదారులు డిజిటల్ పేమెంట్స్ చేసే సమయంలో.. రామచంద్రారెడ్డి జైళ్లశాఖకు చెందిన అధికారిక క్యూఆర్ కోడ్ కు బదులుగా.. తన వ్యక్తిగత ఫోన్ పే కు సంబంధించిన కూఆర్ కోడ్ ను ఉపయోగించినట్లు సమాచారం. నగదురూపంలో వచ్చే ఆదాయాన్నే లెక్కల్లో చూపించి.. డిజిటల్ స్కామ్ కు తెరలేపినట్లు తెలుస్తోంది. రామచంద్రారెడ్డిపై క్రిమినల్ కేసుతోపాటు.. జైళ్లశాఖలో ఉంటూ అవినీతికి పాల్పడినందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ అవినీతిలో రామచంద్రారెడ్డి ఒక్కరే ఉన్నారా లేక ఇతర సిబ్బంది సహకారం కూడా ఉందా? అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు.






