- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో ఆధునిక మిస్టింగ్ బస్ స్టాప్‌ల ఏర్పాటు..
ఖమ్మం కార్పొరేషన్ నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దిశ, ఖమ్మం కార్పొరేషన్: ఖమ్మం కార్పొరేషన్ నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో, ఎన్ఎస్‌పి కెనాల్ వాక్‌వే వద్ద, సర్దార్ పటేల్ స్టేడియం సమీపంలో ఆధునిక మిస్టింగ్ బస్ స్టాప్‌లు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మిస్టింగ్ బస్ స్టాప్‌లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మిస్టింగ్ వ్యవస్థ ద్వారా సూక్ష్మ నీటి బిందువులు విడుదలై పరిసర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. దీంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, చిన్నారులు వేసవి తీవ్ర ఎండల నుంచి ఉపశమనం పొందగలుగుతారు. అలాగే ఈ బస్ స్టాప్‌లను పర్యావరణహితంగా రూపొందిస్తూ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మొక్కలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నగర సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.






